Kaizer News

Kadiyam: కడియపులంకలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్

Kadiyam: కడియపులంకలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadiyam: కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు గోరంట్ల వారి కార్యాలయం నందు కడియపులంక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కుటుంబ సభ్యులందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు తను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నానని, వందలాది మంది కార్యకర్తలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందించామని, అనేకమందికి సొంత నిధులు కూడా అందిస్తున్నానని, ఇప్పటికే గ్రామంలో కోట్లాది రూపాయలతో పనులు పూర్తి చేశామని, అనేక పనులు నిర్మాణ దశలో ఉన్నాయని, రేపు కడియం మండలంలో సాస్కీ నిధులు 7.87 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. కడియపులంక కార్యకర్తల కోరిక మేరకు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాన్ని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గ్రామ పార్టీ అధ్యక్షులు సత్తి వెంకటగిరి, పాఠంశెట్టి రాంజీ, బొరుసు శేషగిరి, వారా రాము, నందివాడ గాంధీ, నందివాడ బోసు, పడమట వరప్రసాద్, కోమలి రామకృష్ణ, నూనె వెంకటేశ్వరరావు, ఐతిరెడ్డి అచ్చిరాజు, బండి నాగమణి, వడ్లమూరి రాజేష్, అరుగుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News