Kaizer News

బెల్లంపల్లిలో ఘనంగా రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

బెల్లంపల్లిలో ఘనంగా రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

· State - Telangana · prabhanews.com

ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం: జీఎం రాధాకృష్ణ సోమగూడెంలో 6వ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌ ప్రారంభం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యల శిక్షణ ఎంతో అవసరమని మందమర్రి సింగరేణి జీఎం రాధాకృష్ణ పేర్కొన్నారు. బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం త్రినేత్రి ఫంక్షన్‌ హాల్‌లో కరాటే మాస్టర్‌ కుందేళ్ల రవి ఆధ్వర్యంలో ఆదివారం 6వ రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం వల్ల విద్యార్థులలో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. నిత్య సాధన వల్ల పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడలతో పాటు చదువుకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్థానికంగా ఇంత ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న మాస్టర్‌ కుందేళ్ల రవిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వివిధ స్థాయిల మాస్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సుమారు 600 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోటీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ నాతరి స్వామి, సీపీఐ సీనియర్ దాగం మల్లేష్, కమిటీ అధ్యక్షుడు మల్లేష్‌తో పాటుకరాటే అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News