Kaizer News

పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది

పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది

· State - Telangana · sakshi.com

రెండు ప్రపంచాల మధ్య పెరిగినా, ఆమె గొంతులో మాత్రం ఎప్పుడూ సంగీతమే ఉంటుంది. మైక్‌ చేతిలో పడితే భాష ఏదైనా, గానం మాత్రం తనదే! కలలకు హద్దులు పెట్టుకోకుండా, తనదైన స్వరాలతో దారులను వేసుకుంటూ ముందుకు సాగుతున్న జోనితా గాంధీ చెప్పిన కొన్ని ఆసక్తికర సంగీత సంగతులు మీకోసం! ఇండియా అంతా ఇంట్లోనే! ఢిల్లీలో పుట్టినా కానీ, పెరిగిందంతా కెనడాలోనే. ఇంటి బయట కెనడియన్ లైఫ్‌ ఉంటే, అమ్మానాన్నలు ఇంట్లో ఎప్పుడూ లతాజీ, కిశోర్‌ కుమార్‌ పాటలు పెట్టి ఇండియానే ఇంట్లోకి తెచ్చారు! అందుకే నా యాక్సెంట్‌ కెనడియన్ గా ఉన్నా, నా పాటల్లో మాత్రం ఇండియన్ ఫ్లేవర్‌ ఎప్పుడూ ఉంటుంది. అందుకే, నన్ను ‘టొరంటోస్‌ నైటింగేల్‌’ అని పిలిచేవారు. ఆ పేరు నాకు చాలా ఇష్టం. రెండు డిగ్రీలు ఉన్నాయి! సంగీతం అంటే ఎంత ఇష్టమో చదువు కూడా అంతే. హెల్త్‌ సైన్సెస్‌తో పాటు బిజినెస్‌లోనూ డిగ్రీ చేశాను. ఒకవైపు క్లాసులు, మరోవైపు పాటలు... మధ్యలో కార్పొరేట్‌ కంపెనీలో పనిచేశాను. అప్పట్లో నా జీవితం చూస్తే ‘సింగర్‌? బిజినెస్‌? డాక్టర్‌?’ ఏ రంగంలోకి వెళ్తానో నాకే అనుమానం వచ్చేది! చివరికి మైక్‌ నన్ను గెలిచేసింది. యూట్యూబ్‌లో యెస్‌! నాకు పదహారేళ్ల వయసులో ‘కెనడియన్ ఐడల్‌’కి ఆడిషన్ ఇచ్చాను. మొదటి రౌండ్‌లోనే నో చెప్పారు! అప్పట్లో బాధగానే అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... ఆ ‘నో’ లేకపోతే నా ‘యెస్‌’ కథ ఇంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది. తర్వాత యూట్యూబ్‌లో పాటలు పాడుతూ నా సొంత దారిని వెతుక్కున్నాను. ట్వీట్‌ చూసి... రెహమాన్‌ సర్‌! కొన్ని అవకాశాలు సినిమాటిక్‌గా వచ్చాయి. రెహమాన్ సర్‌ నా పాటను ఒక ట్వీట్‌ ద్వారా విన్నారు. అది నా కెరీర్‌కు కొత్త తలుపు తెరిచింది. తర్వాత ‘కహా హూ మై’లాంటి పాట పాడే అవకాశం రావడం ఒక కలలా అనిపించింది. డ్యాన్స్ నా మొదటి స్టేజ్‌ లవ్‌! నేను మొదట స్టేజ్‌పైకి వచ్చింది డ్యాన్సర్‌గా! మూడున్నరేళ్ల వయసులోనే ‘చన్నే కే ఖేత్‌ మే’ పాటకు స్కూల్‌లో డ్యాన్స్ చేశాను. ఇప్పుడు పాట పాడుతూ డ్యాన్స్ చేసే అవకాశం వస్తే, చిన్నప్పటి ఆ అమ్మాయి ఇంకా నాలోనే ఉందనిపిస్తుంది. ఆ అమ్మాయే అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది. పాట కోసం, భాషే నేర్చుకోవాలి! చాలా భాషల్లో పాటలు పాడాను. కానీ ప్రతి భాష నాకు వచ్చు అనుకోను. కొత్త భాషలో పాట వచ్చినప్పుడు ఒక్కో పదం ఎలా పలకాలో, దాని యాస, అర్థం రాసుకుంటాను. సింగర్‌ ఎడ్‌ షీరన్ తో చేసిన పని నాకు చాలా ప్రత్యేకం. ఇలాగే, భవిష్యత్తులో వేర్వేరు దేశాల కళాకారులతో కలిసి పనిచేయాలని ఉంది. పాటల్లో ‘క్లోసెట్‌’ కూడా ఉంది! పాటలు పాడటం ఒక ప్రపంచం అయితే, రాయటం మరో ప్రపంచం. పదిహేడేళ్ల వయసు నుంచే పాటలు రాస్తున్నాను. కానీ వాటిని బయటకు చూపించడానికి భయపడ్డాను. రాసిన పాటను బయటకు పెడితే, అందులో మనమే కనిపిస్తాం కదా! ఇప్పుడు నా సొంత సంగీతానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్లి వేడుకల్లో... ‘ఫ్రీ రిహార్సల్‌’! పెళ్లిళ్ల సీజన్ లో మా లైవ్‌ షోలు చాలా పెరుగుతాయి. కొన్నిసార్లు జనాలు తినడంలో, మాట్లాడుకోవడంలో బిజీగా ఉంటారు. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? దాన్ని ‘పెయిడ్‌ రిహార్సల్‌’గా భావిస్తాను! బ్యాండ్‌తో కొత్త వోకల్‌

Original source: sakshi.com
Read more on Kaizer News