Kaizer News

రూ.40 వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్‌ కాప

రూ.40 వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్‌ కాపీ ఇస్తామన్నారా?

· State - Telangana · prabhanews.com

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్‌ కేంద్రంలోని 15వ కార్పొరేషన్‌ పరిధి హనుమాన్‌ టెంపుల్‌ తండాకు చెందిన 11 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌ కాపీలు అందినట్లు సమాచారం. అయితే కే. లక్ష్మి, కాట్రావత్‌ భారతి అనే ఇద్దరు లబ్ధిదారుల ప్రొసీడింగ్‌ కాపీల కోసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు కేలావత్‌ రమేష్‌ నాయక్‌, రవికుమార్‌ నాయక్‌ రూ.40 వేలు డిమాండ్‌ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ప్రొసీడింగ్‌ కాపీలు అందించేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కోరారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ రమేష్‌ నాయక్‌తో పాటు బాధితులు కే. లక్ష్మి, కాట్రావత్‌ భారతి, వెంకటేష్‌, నరేష్‌, హనుమంతు తదితరులు ఉన్నారు. కాగా, రూ.40 వేలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై సంబంధిత కాంగ్రెస్‌ నాయకుల వివరణ తెలియాల్సి ఉంది

Original source: prabhanews.com
Read more on Kaizer News