Kaizer News

తెల్ల జుట్టే మీ స్టయిల్‌..! అస్సలు తగ్గేదేలే..!!

తెల్ల జుట్టే మీ స్టయిల్‌..! అస్సలు తగ్గేదేలే..!!

· State - Telangana · sakshi.com

‘స్ట యిల్‌ గురించి నీకేం తెలుసు నాన్నా!’ అని చెప్పగానే, మైండ్‌లో పాత సోగ్గాడిని గుర్తుచేసుకోకండి! తలలో తెలుపు కనిపిస్తే, స్టయిల్‌కు రిటైర్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రే హెయిర్‌నే స్టేట్‌మెంట్‌గా మార్చి, సరికొత్త సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ స్టయిల్‌తో నాన్నలు కూడా కొడుకులతో పోటీ పడొచ్చు– ఇలా! రంగు దాచొద్దు! స్టయిల్‌గా కనిపించడానికి తెల్ల జుట్టును ప్రతిసారీ రంగు వేసి దాచాల్సిన అవసరం లేదు. చక్కగా ట్రిమ్‌ చేసి, సెట్‌ చేస్తే సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ హెయిర్‌ లుక్‌కే ప్రత్యేకమైన గాంభీర్యం వస్తుంది. ఇక్కడ గడ్డం కూడా గేమ్‌లోనే ఉంచండి. నీట్‌గా ట్రిమ్‌ చేసిన గడ్డం మొత్తం లుక్‌కు మరింత క్యారెక్టర్‌ ఇస్తుంది. షర్ట్‌లో కాస్త క్లాస్‌! లినెన్‌ , కాటన్‌ షర్ట్స్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌కు చాలా బాగా సెట్‌ అవుతాయి. వైట్, నేవీ, ఆలివ్, బీజ్, లైట్‌ బ్లూ వంటి క్లాసిక్‌ రంగులు ఎంచుకోండి. మరీ పెద్ద ప్రింట్లు, ఎక్కువ డిజైన్లకు బదులుగా సింపుల్‌ షర్ట్‌ ప్లస్‌ పర్ఫెక్ట్‌ ఫిట్‌పై దృష్టి పెట్టండి. జీన్స్‌.. జాగ్రత్తగా! లూజ్‌గా వేలాడే ప్యాంట్లకు బదులుగా జీన్స్‌ సెలక్ట్‌ చేసుకోండి. అయితే, జీన్స్‌ ఎంపికలో కాస్త జాగ్రత్త! మరీ టైట్‌గా లేదా రిప్డ్‌గా కాకుండా స్ట్రెయిట్‌ లేదా రిలాక్స్‌డ్‌ ఫిట్‌ జీన్స్‌ ఎంచుకోండి. డార్క్‌ జీన్స్‌ + లైట్‌ షర్ట్‌ + స్నీకర్స్‌ చాలు.. ఇక కొడుకుతో ఫ్యాషన్‌ పోటీ పెట్టుకోవడానికి! బ్లేజర్‌ వేస్తే... గేమ్‌ మారిపోతుంది! సింపుల్‌ షర్ట్‌పై బ్లేజర్‌ వేసుకుంటే ఒక్కసారిగా లుక్‌కు ప్రీమియం టచ్‌ వస్తుంది. అయితే, వీటికి నేవీ, చార్‌కోల్, బీజ్‌ వంటి రంగులు సేఫ్‌ అండ్‌ స్టయిలిష్‌. ఇక్కడ టై అవసరం లేదు... బ్లేజర్‌ వేసుకుని, చేతికి మంచి వాచ్‌ పెట్టుకుంటే చాలు. టీషర్ట్‌కి నో చెప్పొద్దు! టీషర్ట్‌ అంటే కుర్రాళ్లకే అనుకోవద్దు. సాలిడ్‌ కలర్‌ పోలో టీషర్ట్స్, కాలర్‌ టీషర్ట్స్‌ చాలా స్మార్ట్‌గా కనిపిస్తాయి. వైట్, నేవీ, బ్లాక్, గ్రే వంటి సింపుల్‌ రంగులు ఎంచుకుని చినోస్‌ లేదా డెనిమ్‌తో జత చేయండి. నాన్నల సీక్రెట్‌ వెపన్‌! యువత స్మార్ట్‌వాచ్‌ల వెంట పరుగెత్తినా... క్లాసిక్‌ వాచ్‌ ఇచ్చే హంగు వేరే! లెదర్‌ స్ట్రాప్‌ లేదా మెటల్‌ స్ట్రాప్‌తో ఉండే మంచి డయల్‌ వాచ్‌ ఎంచుకోండి. వాచ్‌ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు... క్లాస్‌గా ఉంటే చాలు! షూస్‌ కూడా మాట్లాడాలి! పాత షూస్‌నే ప్రతి డ్రెస్‌కు జత చేయడం మానేయండి. క్యాజువల్‌ లుక్‌కు క్లీన్‌ స్నీకర్స్, స్మార్ట్‌ క్యాజువల్‌కు లోఫర్స్, ఫార్మల్‌ లుక్‌కు క్లాసిక్‌ షూస్‌ ఎంచుకోండి. షూస్‌ శుభ్రంగా ఉంటే... సగం స్టయిల్‌ అక్కడే సెట్‌! సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ అంటే వయసు పెరిగింది అనే సంకేతం కాదు... ‘స్టయిల్‌లో కూడా అనుభవం ఉంది’ అనే స్టేట్‌మెంట్‌గా మార్చుకుంటే.. ట్రెండ్‌ను ఫాలో అయ్యే జెనరేషన్‌కు కూడా ట్రెండ్‌ క్లాస్‌ నేర్పించొచ్చు! - దీపిక కొండి ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పె

Original source: sakshi.com
Read more on Kaizer News