Kaizer News

Parkal: పరకాలలో ఘనంగా గణపతి నవరాత్రి ప్రత్యేక పూజల

Parkal: పరకాలలో ఘనంగా గణపతి నవరాత్రి ప్రత్యేక పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Parkal: పరకాల పట్టణంలోని శక్తి స్థల్ (మార్కెట్ రోడ్ సర్కిల్) వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం గణనాథునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డా. పెసరు విజయ చందర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పరకాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణచారి, వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, రాష్ట్ర నాయకులు కాచం గురుప్రసాద్, పరకాల రూరల్ మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి కృష్ణ ప్రసాద్, పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, నాయకులు పావుశెట్టి శ్రీనివాస్, కుంటమల్ల గణేష్, ముత్యాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు, భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News