గాంధీనగర్ క్రాస్‌రోడ్డు వద్ద పొంచి ఉన్న ప్రమాదం.. గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : పస్రా నుంచి మొద్దులగూడెం వెళ్లే ప్రధాన రహదారిలోని గాంధీనగర్ క్రాస్‌రోడ్డు లో తునికి చెట్టు ప్రమాదకరంగా ఒరిగి ఉండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మొదలు పూర్తిగా పుచ్చిపోయి ఉండటంతో ఏ సమయంలోనైనా కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రహదారి అంచునే ఈ చెట్టు ఉండటంతో వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉంది.ఇదే ప్రాంతంలో గౌడ కార్మికులు తాటికల్లు విక్రయిస్తుండటంతో నిత్యం పలువురు అక్కడికి వస్తుంటారు. పస్రా–మొద్దులగూడెం మార్గంలో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల రాకపోకలు కూడా కొనసాగుతుంటాయి. దీంతో ప్రమాదకరంగా ఒరిగిన చెట్టు ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు, వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే స్పందించి పుచ్చిపోయిన తునికి చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా ఉన్న తునికి చెట్టును పరిశీలించి, వెంటనే తొలగించి ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు