టీఎంసీల ప్రాణహిత జలాలే టార్గెట్… తుమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తుకే మా ప్రయత్నం.. ప్రాణహితను పునరుజ్జీవం.. ప్రాణహిత జలాలను గురుత్వాకర్షణ ద్వారా తరలించడమే లక్ష్యం తక్కువ ఖర్చుతో గరిష్ఠ సాగునీటి ప్రయోజనాలు.. తెలంగాణ నీటి వాటా కోసం మహారాష్ట్రతో కీలక చర్చలు.. సెప్టెంబర్ 1న మహారాష్ట్రతో కీలక చర్చలు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాగునీటి ప్రయోజనాల కోసం ప్రాణహిత ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలకంగా ముందుకు తీసుకెళ్తోంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ఆమోదం పొందడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో జరిగే అంతర్రాష్ట్ర చర్చలకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను భారీ ఎత్తిపోతల అవసరం లేకుండానే గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఈ కీలక చర్చలు జరగనున్నాయి. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు కేంద్ర జల సంఘంలోని కీలక విభాగాల అధికారులు హాజరుకానున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీ సమావేశానికి ముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ తరఫున వినిపించాల్సిన సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై సమీక్షించారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు అవకాశాలపై చర్చించారు. తెలంగాణ జల ప్రయోజనాలను బలమైన సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్ర ముందు ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం 2016లో తుమ్మిడిహట్టి బ్యారేజీకి 148 మీటర్ల ఎత్తును అంగీకరించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సమ్మతి కోరనుంది. కేవలం నాలుగు మీటర్ల ఎత్తు తేడాగా కనిపించినా, నీటి నిల్వ, తరలింపు, సాగునీటి ప్రయోజనాల పరంగా ఇది తెలంగాణకు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణం జరిగితే ప్రాణహిత జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దీంతో భారీ పంపులు, ఎత్తిపోతల వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే భారీ విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా గణనీ