Kaizer News

Kandukur: రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ నుంచి కో

Kandukur: రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ నుంచి కోలుకున్న పసికందు!

· State - Telangana · hmtvlive.com

Shorts Kandukur: కందుకూరు పామూరు రోడ్డులోని శక్తి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో 25 వారాల రెండు రోజులకే 880 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు విజయవంతంగా వైద్యం అందించినట్లు చిన్నపిల్లల ఐసీయూ వైద్యుడు డాక్టర్‌ కేవీ అశోక్‌ చౌదరి తెలిపారు. ఆదివారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్‌ 2న ప్రసవ తేదీగా ఉండగా, ఆగస్టు 4న నీలిమకు నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. సాధారణ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించినట్లు తెలిపారు. శిశువు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో సర్ఫాక్టెంట్‌ మందులు అందించి, కొంతకాలం వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ప్రీమెచ్యూరిటీ కారణంగా ఆర్‌డీఎస్‌, గుండెలో పీడీఏ మూసుకోకపోవడం, శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. రెండు సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ అయినప్పటికీ వెంటనే పునరుద్ధరించి చికిత్స కొనసాగించినట్లు చెప్పారు.శిశువు 44 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందగా, మూడు సార్లు రక్తం ఎక్కించినట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్లు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, మొత్తం చికిత్సలో కేవలం ఐదు రోజులు మాత్రమే యాంటీబయాటిక్స్‌ ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.శిశువు చికిత్స విజయవంతం కావడంలో ఐసీయూ సిబ్బంది, నర్సులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని డాక్టర్‌ అశోక్‌ చౌదరి పేర్కొన్నారు. కందుకూరులోనే చిన్నారులకు అత్యవసర ఐసీయూ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆస్పత్రిని ప్రారంభించినట్లు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News