బరువు తగ్గడం కోసం ఒక్కోక్కరూ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ల శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి అనుగుణంగా డైట్, వ్యాయామాలు ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు మాత్రం కావాలనుకుంటే బరువు పెరగగలడు, స్లిమ్‌గా మారిపోగలడు. ఒక పాత్ర కోసం శారీరక మార్పులతో సహా తనను తాను పూర్తిగా మార్చుకోగల నటుడు. ఆయన సుభాష్‌చద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 2017 నాటి వెబ్ సిరీస్ 'బోస్: డెడ్/అలైవ్' (Bose: Dead/Alive) కోసం ఈ నటుడు 13 కిలోల బరువు పెరిగాడు, ఆ తర్వాత ఏడాదే 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' (Fanney Khan) చిత్రం కోసం ఒక్కనెలలో ఏకంగా పది కిలోల బరువు తగ్గారు. తాను బోస్ వెబ్ సిరీస్ తర్వాత బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని తనకు ముందే తెలుసని, అందుకేనే అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేశానని అన్నారు. ఇలా చేస్తే బరువు తగ్గగలమా అంటే.. ఇది అత్యంత కష్టమైన విధానం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, ఉండటం అంటే..శరీరాన్ని చాలా కష్టబెట్టడమే కాకుండా బలహీన పడే అవకాశాలు ఎక్కువ. కానీ రాజ్ కుమార్ మాత్రం తాను నేరుగా రాత్రి భోజనం మాత్రమే చేస్తానని, అది కూడా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటానని అన్నారు. మరి ఉదయం ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఉండగలరంటే..నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి ఆకలి బాధ అంతగా అనిపించదని చెబుతున్నారు. అలాగే వ్యాయామాలు విషయానికొస్తే..ప్రతిరోజూ కనీసం మూడు గంటల పాటు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తానని అన్నారు. దీపావలి వంటి పండుగ సమయాల్లో నోరు చాలా కట్టడి చేసుకుంటానని, ఎందుకంటే ఫిట్‌గా ఉండటమే తన ప్రధాన లక్ష్యం కాబట్టి అని చెబుతున్నారు రాజ్‌కుమార్. ప్రస్తుతం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada) మూవీలో కనిపించనున్నారు రాజ్‌కుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. మైదానంలోకి పరిగెత్తే ముందు షర్ట్ లేకుండా తన ఇండియా జెర్సీని ఊపుతూ గంగూలీ కనిపించడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి క్షణాన్ని పోస్టర్ ఫస్ట్‌లుక్‌గా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా, రాజ్ కుమార్ అనుసరించే డైట్ విధానం సరైనదేనా అంటే.. అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేస్తే.. దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పైగా, బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే భోజనం అన్నేసి గంటలు తీసుకోకపోతే శరీరం "సర్వైవల్ మోడ్" (ఆకలి మోడ్) లోకి వెళ్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం కేలరీలను ఖర్చు చేయడం తగ్గించి, ఫ్యాట్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల మెటబాలిజం రేటు దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఆకలి ఎక్కువ వేసి..నియంత్రణ కోల్పోయేలా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే శరీరం ఆహారం లభించనప్పుడు కొవ్వుని మాత్రమే గాక శక్తి కోసం కండరాలను కూడా కరిగించేలా చేస్తుంది. కండరాలు తగ్గితే శరీర