Kaizer News

Mahendragiri Varahi: దైవశాపమా..? లేక అంతుచిక్కని ర

Mahendragiri Varahi: దైవశాపమా..? లేక అంతుచిక్కని రహస్యమా..? సుమంత్ సినిమా ట్రైలర్ అదిరింది..!

· Entertainment · hmtvlive.com

Mahendragiri Varahi: విభిన్నమైన కథలతో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే టాలెంటెడ్ హీరో సుమంత్ నటిస్తున్న తాజా స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. వారాహి అమ్మవారి శాపం.. అదో రహస్యం అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లనుంది. కాశీ గ్రామ దేవత అయిన వారాహి మాత మహేంద్రగిరిలో ఎలా వెలిసిందో చూపిస్తూ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతాన్ని ఏలే రాజకుటుంబంలోని సభ్యులు దాదాపు 150 సంవత్సరాలుగా ఒకరి తర్వాత ఒకరు విచిత్రమైన పరిస్థితుల్లో మరణిస్తూ ఉంటారు. ఈ మరణాల వెనుక వారాహి అమ్మవారి శాపం ఉందని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు. అందరూ దైవాగ్రహానికి భయపడి ఊరుకుంటే, హీరో మాత్రం ఆ శాపాన్ని నమ్మడు. దేవుడి పేరిట జరుగుతున్న ఈ మరణాల వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి దైవశక్తినే ఎదురించే సాహసం చేస్తాడు. నమ్మకానికి, నిజ శోధనకు నడుమ సాగే ఈ ఉత్కంఠభరిత పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రంలో సుమంత్ చాలా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. అత్యంత శక్తివంతమైన వారాహి మాత పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ట్రెండింగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ ఒక కీలక పాత్రలో సర్‌ప్రైజ్ ఇవ్వడం ఈ చిత్రానికి మరో పెద్ద ప్లస్ పాయింట్. వీరితో పాటు మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కాళిపు మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకులకు సరికొత్త థ్రిట్రికల్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతున్న ఈ స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News