Kaizer News

Alluri District: ఫిర్యాదుల నమోదుకు పీజీఆర్‌ఎస్‌ క్

Alluri District: ఫిర్యాదుల నమోదుకు పీజీఆర్‌ఎస్‌ క్యూఆర్‌ కోడ్ అందుబాటు

· State - Telangana · hmtvlive.com

Shorts అల్లూరి సీతారామరాజు: అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలకు ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) క్యూఆర్‌ కోడ్ ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా పీజీఆర్‌ఎస్‌ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇకపై కార్యాలయాలకు వెళ్లకుండానే ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పీజీఆర్‌ఎస్‌ క్యూఆర్‌ కోడ్‌ను ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, ఫిర్యాదులను నమోదు చేసి పరిష్కారం పొందాలని జిల్లా యంత్రాంగం కోరింది. పీజీఆర్‌ఎస్‌ క్యూఆర్‌ కోడ్‌ – స్కాన్‌ చేయండి.. ఫిర్యాదు నమోదు చేయండి.. పరిష్కారం పొందండి. అని జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని అల్లూరు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అధికారులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News