Kaizer News

Manempally | మనెంపల్లిలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సర్ప

Manempally | మనెంపల్లిలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సర్పంచ్‌పై పోలీసుల జులుం

· State - Telangana · ntnews.com

సర్పంచ్ భర్తను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు పాత గ్రామ పంచాయతీ కార్యాలయం కూల్చివేతపై వివాదం https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2026/09/WhatsApp-Video-2026-09-19-at-9.51.35-AM.mp4 Manempally | తిమ్మాపూర్, సెప్టెంబర్ 19 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజాము నుండి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాత గ్రామపంచాయతీనీ కూల్చేందుకు తమకు ఆర్డర్స్ ఉన్నాయంటూ అధికారులు గ్రామ పంచాయతీ వద్దకు వచ్చారు. దీంతో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి నుండి నడిచిన హైడ్రామా నడుమ ఉదయం పోలీసులు ఎంట్రీ ఇచ్చి బలవంతంగా పలకవర్గాన్ని అడ్డుకుని జేసీబీతో పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చుతున్నారు. దీంతో నోటీసులు ఇవ్వకుండా కుల్చడానికి రావడంతో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. ప్రొసీజర్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సునీత ఆరోపించారు. బలవంతంగా అరెస్ట్.. తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులతో భారీ బందోబస్తు నడుమ వచ్చిన అధికారులు సర్పంచ్ సునీత భర్త పొన్నం అనిల్ గౌడ్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో అధికారులు, పాలకవర్గానికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా అధికారులు మాత్రం తమకు కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నాయంటూ వాదించారు. తమకు కూడా గతంలో కూల్చవద్దని గ్రామపంచాయతీ ఇతర అవసరాలకు పాత కార్యాలయాన్ని వినియోగించుకోవాలని గతంలో చెప్పినట్లు పాలకవర్గం వివరించింది

Original source: ntnews.com
Read more on Kaizer News