లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 20 లీటర్ల నాటుసారా స్వాధీనం నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలోని శికారిపేటలో నాటుసారా తయారీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 40 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అదే ప్రాంతానికి చెందిన శికారి రాజు వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శికారి రాజుపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నందికొట్కూరు పట్టణంలో నాటుసారా తయారీ, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ అశోక్‌కుమార్ హెచ్చరించారు. భవిష్యత్తులోనూ నాటుసారా తయారీ, విక్రయాలపై దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు