Kaizer News

క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు బృందం

క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు బృందం

· National - India · sakshi.com

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్స్) పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరి ధాటికి కజకిస్థాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. మొదటి సింగిల్స్‌లో కామిలా స్మాగులోవాపై 21-7, 21-9 తేడాతో పి.వి. సింధు ఘనవిజయం సాధించింది. అనంతరం రెండో సింగిల్స్‌లో అలెస్సా కులేషోవాను 21-7, 21-10 తేడాతో ఉన్నతి హుడా ఓడించి భారత ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. ఇక మూడో సింగిల్స్‌తో డయానా నమేనోవాపై 21-5, 21-10 తేడాతో తన్వి శర్మ విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్‌ పూర్తి చేసింది. ఈ భారత త్రయం కేవలం 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. మంగళవారం రోజున క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్‌య జపాన్ జట్టుతో భారత బృందం తలపడనుంది. మొదటి రౌండ్‌లో 'బై' పొందిన జపాన్, క్వార్టర్స్‌లో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్‌? కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News