Kaizer News

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

· State - Telangana · prabhanews.com

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, భద్రత, రోగుల సంరక్షణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, భద్రతా కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేతనాలు సకాలంలో అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కనీస వేతనం రూ.26 వేలు ఉండగా, కార్మికుల ఖాతాల్లో కేవలం రూ.11 వేలు మాత్రమే జమ చేస్తున్నారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని కూడా నెలనెలా సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి పారిశుద్ధ్య, భద్రతా కార్మికుల అధ్యక్షుడు బి. రాజేందర్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News