పి. వెంకటేశ్వర శర్మ సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు పి. వెంకటేశ్వర శర్మ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మను ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘనంగా సన్మానించి, ఆయన అందించిన విద్యా సేవలను అభినందించారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పి. వెంకటేశ్వర శర్మకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు