Kaizer News

బీజేపీ మహా దీక్షను విజయవంతం చేయాలి: రితీష్ రాథోడ్

బీజేపీ మహా దీక్షను విజయవంతం చేయాలి: రితీష్ రాథోడ్

· State - Telangana · prabhanews.com

ఉట్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 22ఏ భూముల పేరుతో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండు రోజుల మహా దీక్షను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న దీక్షకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టనున్న రెండు రోజుల దీక్షకు ఉట్నూర్ మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని కోరారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మండల శాఖకు చెందిన నాయకులు, కార్యకర్తలు మహా దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రితీష్ రాథోడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాలి శ్రీకాంత్, ఎస్టీ మోర్చా కార్యదర్శి రాథోడ్ శేషరావు, మండల ప్రధాన కార్యదర్శి సాల్గర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News