Kaizer News

AP Residence Certificate : ఆధార్, రేషన్ కార్డు సరి

AP Residence Certificate : ఆధార్, రేషన్ కార్డు సరిపోతుందా? రెసిడెన్స్ సర్టిఫికెట్‌ ఎవరికి అవసరం? ఫుల్ డిటెయిల్స్

· State - Telangana · 10tv.in

> ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఆధార్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుందా? రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు? AP Residence Certificate : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రతిసారీ ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణ ప్రభుత్వ పథకాలు, సేవలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవచ్చు. ఇకపై ఏపీ ప్రజలెవరూ చిన్నచిన్న అవసరాల కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే, రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వం మళ్లీ తహసీల్దార్లకు అప్పగించింది. ఎవరికైనా రెసిడెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలంటే తగిన ఆధారాలతో తహసీల్దార్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు అందుబాటులో లేకుంటే తహసీల్దార్ స్థానికంగా విచారణ నిర్వహించి నివాసాన్ని నిర్ధారించిన తర్వాత సర్టిఫికెట్ జారీ చేయవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రెసిడెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ముఖ్యంగా పీవీటీజీ ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేట్ కోసం తహసీల్దార్లు నివాస ధ్రువీకరణ డాక్యుమెంట్లను జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. Read Also : Dussehra Special Trains : సొంతూరికి వెళ్లేవారికి బిగ్ రిలీఫ్.. దసరా, దీపావళికి ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్లు..! అడ్రస్ ప్రూఫ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్ : అలాగే ఐఐటీ, ఐఐఎమ్, సెంట్రల్ యూనివర్సిటీల వంటి కేంద్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్ సమయంలో సంబంధిత సంస్థలు అడ్రస్ ప్రూఫ్ కోరితే రెసిడెన్స్ సర్టిఫికెట్ చూపించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర రక్షణ రంగ నియామకాల సమయంలో అడ్రస్ వెరిఫికేషన్ అవసరమైతే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే, తహసీల్దార్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందినవారు మళ్లీ కొత్తగా సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాత వ్యాలీడ్ అయ్యే సర్టిఫికెట్‌ను అవసరమైన సందర్భాల్లో వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పథకాలు, సేవలకు ఆధార్ లేదా రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు సరిపోవచ్చు. కానీ, ప్రత్యేకంగా రెసిడెన్స్ ప్రూఫ్ కోరే విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రక్షణ రంగ నియామకాలు వంటి సందర్భాల్లో తహసీల్దార్ జారీ చేసే రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం తప్పనిసరి అవుతుంది

Original source: 10tv.in
Read more on Kaizer News