Kaizer News

Penamaluru: వాతావరణ నష్టాల నుంచి గట్టెక్కాలంటే పామ

Penamaluru: వాతావరణ నష్టాల నుంచి గట్టెక్కాలంటే పామాయిల్ సాగు మేలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Penamaluru: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టాలను భర్తీ చేయడం ఏ ప్రభుత్వానికైనా సవాలుగా మారుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ (పామాయిల్) సాగు వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కంకిపాడు మండలం మద్దూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతాంగానికి అండగా నిలుస్తున్నప్పటికీ, తుఫాన్లు, అధిక వర్షాల వంటి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని పూర్తిగా పూడ్చడం సాధ్యం కావడం లేదు. ఉద్యాన పంటలైన అరటి, పసుపు, కంద, మొక్కజొన్నలతో పాటు వరి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు వంటి లోతట్టు ప్రాంతాలు అధిక వర్షాలకు తరచూ ముంపునకు గురవుతున్నాయి . వరి సాగుకు ఎకరాకు ₹30,000 నుంచి ₹35,000 వరకు ఖర్చు పెట్టిన తర్వాత, పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. బీమా సంస్థలు సైతం ఈ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. పామాయిల్ సాగుతో ఎన్నో ప్రయోజనాలు: ఎమ్మెల్యే. పామాయిల్ తోటలు తుఫాన్లు, ఈదురుగాలులను తట్టుకుంటాయి. వరద నీరు చేరి వారం పది రోజుల పాటు చెట్లు ముంపులో ఉన్నా పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసినా పాడవదు అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News