Jagtial: జగిత్యాల, స్థానిక పావని కంటి ఆసుపత్రి, ఆపి మరియు రోటరీ క్లబ్ జగిత్యాల సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, శస్త్రచికిత్సలు పూర్తయిన బాధితులకు ఉచితంగా కళ్ళద్దాలు మరియు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ... నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన పావని కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని, రోటరీ క్లబ్ సభ్యులను అభినందించారు. పేదలకు సేవ చేయడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పావని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విజయ్, సీనియర్ నాయకులు బండ శంకర్, శ్రీనివాసరావు, ఏనుగుల రాజులతో పాటు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు