మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని జిల్లాకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ముంబైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లాను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గుర్తింపు అంశంపై బీసీసీఐ ఏజీఎంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. పది లక్షలలోపు జనాభా ఉన్న పుదుచ్చేరి, అండమాన్‌లకు సైతం బీసీసీఐ అసోసియేట్ గుర్తింపు ఇచ్చి దేశవాళి టోర్నీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 2.5 కోట్ల జనాభా ఉన్న గ్రామీణ తెలంగాణకు అదే తరహాలో గుర్తింపు అందించి ప్రతిభావంతులైన తెలంగాణ క్రికెటర్లు దేశవాళీ తద్వారా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన సయ్యద్ నవాజ్‌షా, ఎండి.రియాజుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి ఉన్నారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే