Kaizer News

Penumantra: పెనుమంట్రలో అంతర్జిల్లా దొంగల అరెస్ట్.

Penumantra: పెనుమంట్రలో అంతర్జిల్లా దొంగల అరెస్ట్.. 2 కిలోల వెండి స్వాధీనం!

· State - Telangana · hmtvlive.com

Shorts పెనుమంట్ర: అంతర జిల్లా పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రెండు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పెనుమంట్ర, ద్వారకాతిరుమల, రావులపాలెం, పోడూరు పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఐదు దొంగతనం కేసులకు సంబంధించి నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో పెనుగొండ మండలం చినమల్లం గ్రామానికి చెందిన గెడ్డాడ సురేంద్ర అలియాస్‌ సూర్య (24), తణుకుకు చెందిన సోదవరపు సాయి అలియాస్‌ దూలా సాయి (22) ఉన్నారు. పెనుమంట్ర పోలీసు స్టేషన్‌ పరిధిలో నమోదైన రెండు కేసులు, ద్వారకాతిరుమల, రావులపాలెం, పోడూరు పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఒక్కో కేసులో వీరు నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఆయా కేసులకు సంబంధించిన సుమారు రెండు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిమ్‌ ఆస్మి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, నరసాపురం ఉప పోలీసు అధికారి మేకా సుధాకర్‌ సూచనలతో పెనుగొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాయుడు విజయ్‌కుమార్‌ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పెనుమంట్ర ఎస్‌ఐ కె. స్వామి, ఆచంట ఎస్‌ఐ కె. వెంకటరమణ, పెనుగొండ సర్కిల్‌ సిబ్బంది సమన్వయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అంతర జిల్లా పరిధిలో నమోదైన ఐదు దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. నరసాపురం ఉప పోలీసు అధికారి మేకా సుధాకర్‌, పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్‌, పెనుమంట్ర ఎస్‌ఐ కె. స్వామి, ఆచంట ఎస్‌ఐ కె. వెంకటరమణతో పాటు సర్కిల్‌ సిబ్బందిని ప్రశంసించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News