Kaizer News

Prathipadu: ప్రత్తిపాడులో సెల్ టవర్ బ్యాటరీల చోరీ

Prathipadu: ప్రత్తిపాడులో సెల్ టవర్ బ్యాటరీల చోరీ ముఠా అరెస్ట్!

· State - Telangana · hmtvlive.com

Shorts ప్రత్తిపాడు: ప్రత్తిపాడు, అన్నవరం కిర్లంపూడి గండేపల్లి పిఠాపురం తొండంగి తుని అనపర్తి తదితరు ఏరియాల్లో జరుగుతున్న సెల్ టవర్ల బ్యాటరీ దొంగలను పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు చూచనలు మేరకు ఎస్ ఐ లక్ష్మీ కాంతం తన సిబ్బంది తో టీమ్ లుగా ఏర్పడి నలుగురు నిందితులను దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన ఎయిర్టెల్ టెక్నీషియన్ అమలకంటి సూరిబాబు, తుని మార్కండేయ పేటకు చెందిన ఎయిర్టెల్ టెక్నీషియన్ చందం కనకదుర్గ పార్థసారథి, తుని గవరపేటకు చెందిన ఏటీసీ టెక్నీషియన్ అల్లవరపు వెంకటేశులు, వీరి వద్ద నుండి బ్యాటరీలు విక్రయిస్తున్న తుని పట్టణం కు చెందిన పులి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 67 బ్యాటరీలను, రూ 3లక్షల 75వేలు నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి ఏబీజీ తిలక్ మాట్లాడుతూ చోరీకి గురైన బ్యాటరీల కేసులో నలుగురిని అదుపులో తీసుకున్నామని తెలిపారు. వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసామని అన్నారు. నిందితులు క్రికెట్ బెట్టింగ్ జూధాలకు, చెడు వ్యసనాలకు బానిసలై పనిచేసే సంస్థల్లోనే దొంగతనాలకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సెల్‌ఫోన్ టవర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, బ్యాటరీల చోరీలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సెల్ టవర్ బ్యాటరీ చోరీ కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ బి సూర్య అప్పారావు ఎస్ఐ లక్ష్మీకాంతం, శ్రీహరి బాబులను ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. టీం సభ్యులకు నగదు రివార్డును డి.ఎస్.పి తిలక్ చేతుల మీదుగా అందించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News