Kaizer News

Veligonda Project: ముప్పై ఏళ్ల కల నేడు నిజం ! పూల

Veligonda Project: ముప్పై ఏళ్ల కల నేడు నిజం ! పూల సుబ్బయ్య వెలిగొండ తొలి దశ ప్రారంభం!

· State - Telangana · telugu.abplive.com

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ తొలిదశ ప్రారంభిస్తారు. దశాబ్దాల కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే ప్రాజెక్ట్ లక్ష్యం. ఆగస్టు 30న విజయవంతమైన ట్రయల్ రన్ ప్రజల్లో ఆనందం నింపింది. 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, ఇప్పుడు ప్రారంభించారు. Veligonda Project: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మహత్తరమైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని తీవ్ర కరువు ప్రాంతాల దశాబ్దాల నీటి కష్టాలు తీర్చే పూలసుబ్బయ్య వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం(31 ఆగస్టు 2026) ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలోని క్రాస్ రెగ్యలేటర్ వద్ద సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి పరుగులు పెడుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవంతో మూడు దశాబ్దాలు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతూ, కృష్ణ జలాలు నల్లమలసాగర్ జలాశయంలోకి ప్రవేశించనున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ పద్ధతిలో జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలించనున్నారు. ఈ తొలి దశ జలాల విడుదల ద్వారా మొదటి విడత కింద సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే దాదాపు 4 లక్షల మంది జనాభాకు సురక్షితమైన తాగునీటిని అందిచాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాకారం చేసింది. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాల పతనం, ఫ్లోరైడ్ సమస్యలతో అల్లాడిపోతున్న దుర్భిక్ష ప్రాంతానికి వెలిగొండ కొత్త కళను తీసుకురానుంది. వెలిగొండ ప్రాజెక్టు కేవలం ఒక సాగునీటి కట్టడం కాదు,ఇది పశ్చిమ ప్రకాశం(మార్కాపురం) పరిధిలోని కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్య. సిరగ్గా 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘం కాలం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సాంకేతిక అవరోధాలు, నిర్మాణపరమైన సవాళ్లను దాటుకొని, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేతుల మీదుగానే తొలి దశ ప్రారంభమవుతోంది. ఈ 30 ఏళ్ల నిర్మాణ ప్రయాణం ఎంతో కఠినమైంది. నల్లమల కొండల గుండా భారీ జంట సొరంగాలను తొలిచే ప్రక్రియలో అత్యంత క్లిష్టమైన సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. శంకుస్థాపన జరిగిన మొదట్లో దీని గురించి నాడు చేసింది తక్కువే. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్‌పై ఉన్న ప్రాజెక్టును క్షేత్రస్థాయికి తీసుకొచ్చింది. అనంతరం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిధుల కొరత వేధిస్తున్నా ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాయి. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే స్పీడ్‌తో పనులు పూర్తి చేసింది. టన్నెల పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, ఇతర నిర్మాణాలు, నిర్వాసితుల పరిహారంపై దృష్టి పెట్టి పరిష్కరించింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడ జిల్లాల్లోని కరవు ప్రాంతాల రూపు రేఖలు మారిపోనున్నాయి. మొత్తం ప్రాజెక్టు అం

Original source: telugu.abplive.com
Read more on Kaizer News