Chittoor: చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి ప్రాంతంలో గల శ్రీ సప్త కన్యకలమ్మ ఆలయంలో నాగదేవతలు, మునేశ్వర స్వామి,శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.అలాగే ఆలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన దీపస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పరిసర ప్రాంతాల్లో భక్తి వాతావరణం నెలకొంది. దొడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కే. బాలాజీ,మూడో వార్డు అధ్యక్షులు తిరుకుమారన్,నగర మహిళా అధ్యక్షురాలు నళిని తిరుకుమరన్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలకృష్ణతో పాటు ఆలయ పాలకవర్గ సభ్యులు, దొడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలయంలో నాగదేవతలు, మునేశ్వర స్వామి,శివలింగం ప్రతిష్టాపనతో ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరిందని నిర్వాహకులు తెలిపారు