Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన […]