Kaizer News

పట్టు బిగించిన ఇంగ్లండ్‌

పట్టు బిగించిన ఇంగ్లండ్‌

· Sports · ntnews.com

లండన్‌: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ పట్టు బిగించింది. పాక్‌ బౌలర్లు పుంజుకున్నా.. భారీ లక్షాన్ని నిర్దేశించే దిశగా ముందుకెళ్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 81/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లిష్‌ టీమ్‌ వర్షం కారణంగా ఆట నిలిచిపోయిన సమయానికి 177/7 స్కోరు చేసింది. డాన్‌ లారెన్స్‌ (50 బ్యాటింగ్‌), హ్యారీ బ్రూక్‌ (34) రాణించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అబ్బాస్‌ 4, మహ్మద్‌ అలీ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలుపుకొని ఇంగ్లండ్‌ ప్రస్తుతానికి 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 110 రన్స్‌కే కుప్పకూలింది

Original source: ntnews.com
Read more on Kaizer News