Kaizer News

Gadwal: గద్వాల బసల్ చెరువులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవ

Gadwal: గద్వాల బసల్ చెరువులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం!

· State - Telangana · hmtvlive.com

Gadwal: గద్వాల మండలం పరిధిలో బసల్ చెరువు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత లో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. దాదాపుగా 2000 పైగా ఇండ్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న. త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేయాలి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారి తో సాధ్యమైనది అని పేర్కొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News