Kaizer News

బంగారం ధరలను ప్రభావితం చేస్తోన్న ఆ పరిణామాలు

బంగారం ధరలను ప్రభావితం చేస్తోన్న ఆ పరిణామాలు

· National - India · telugu.oneindia.com

దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. పసిడి, వెండి ధరలు సరికొత్త గరిష్టాల వైపు దూసుకెళ్తోన్నాయి. కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ రెండింటి ధరలు భారీ లాభాలతో పరుగులు తీశాయి. దీనికి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల సెంటిమెంటే ప్రధాన చోదక శక్తిగా నిలిచాయని చెబుతున్నారు. ఎమ్‌సీఎక్స్‌లో అక్టోబర్ 5వ తేదీ నాటి గోల్డ్ ఫ్యూచర్స్ 0.63 శాతం లాభ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,940 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అదే క్రమంలో డిసెంబర్ 4 నాటి సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు మరింత దూసుకెళ్లాయి. కిలో వెండి ధర ఏకంగా 1.22 శాతం పెరిగింది. 2,41,100 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ మధ్యకాలంలో వెండి ధరలు ఈ స్థాయికి చేరుకోవడం, వీటి రేట్లు భారీగా పెరగడం ఇదే మొదటిసారి. డాలర్ విలువ బలహీనపడిన ప్రతిసారీ ఇతర కరెన్సీల వినియోగదారులకు పసిడి చౌకగా మారుతుంది. అలా జరిగిన ప్రతీసారీ బంగారాన్ని కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతుంటారు. ఇది.. బంగారానికి డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తుంది. బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బాండ్లు, డిపాజిట్ల కంటే సురక్షితమైన ఆభరణాలపై పెట్టుబడులు పెట్టడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. నిత్యావసరాల ధరలు పెరిగి ఆర్థిక అస్థిరత ఏర్పడినప్పుడు బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా మారుతుంటుంది. వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడని వస్తువులు వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు- రూ. 15,584, 22 క్యారెట్లు - రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 12,055 24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688 24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688 24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688 24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688 24 క్యారెట్లు - రూ. 15,584, 22 క్యారెట్లు- రూ. 14,285, 18 క్యారెట్లు - రూ. 11,688

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News