Kaizer News

Samson - Sooryavanshi Debate: కొత్త టాలెంట్ రాగానే

Samson - Sooryavanshi Debate: కొత్త టాలెంట్ రాగానే పాతవాళ్లను తీసేస్తారా..? సంజూని స్వేచ్ఛగా ఆడనివ్వండి, వైభవ్ ఎంట్రీపై అంజుమ్ చోప్రా బోల్డ్ కామెంట్స్

· Sports · telugu.abplive.com

అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి రాబోయే ఆసియా క్రీడలకు ముందు అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్ పొడవునా 15 ఏళ్ల సంచలన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని బెంచ్‌పై కూర్చోబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ సంజూ శాంసన్ కు వరుస అవకాశాలు ల‌భించాయి. అతడు తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా విధ్వంసకర హాఫ్ సెంచరీలతో విరుచుకుపడి తన సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఎంట్రీ, సంజూ శాంసన్ స్థానంపై మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తాజాగా ప్రత్యేకంగా మాట్లాడుతూ.. "సంజూ శాంసన్‌ను అతడి మానాన ఆడనివ్వాలి. ఇండియాకు ఆడుతున్నప్పుడు ఎవరికైనా పోటీ, ఒత్తిడి సహజమే. కానీ జట్టులో తన స్థానంపై ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకం వేలాడుతూ ఉండటం ఏ ఆటగాడికీ ఇష్టం ఉండదు. సంజూకి స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు ఇవ్వాలి. కొత్త టాలెంట్ కనిపించిన ప్రతిసారీ ఒకరి స్థానంలో మరొకరిని రీప్లేస్ చేయాలని చూడటం సరికాదు. కొత్త ఆటగాడు వచ్చాడని పాతవారి విలువ తగ్గిపోదు. వైభవ్ అద్భుతమైన టాలెంట్, కానీ సంజూ, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ కూడా కష్టపడి అవకాశాలు దక్కించుకున్నారు" అని ఆమె పేర్కొంది. Read Also: Team India Selection Controversy: ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు రోహిత్ రిటైర్మెంట్‌పై.. వచ్చే వన్డే ప్రపంచకప్ సమయానికి 40 ఏళ్ల వయసుకు చేరుకోనున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలపై కూడా అంజుమ్ వ్యాఖ్యానించింది. "ఆటను ఎప్పుడు ఆపాలో నిర్ణయించుకోవాల్సింది ఆటగాడు మాత్రమే. ఆడే ఉత్సాహం, ఫిట్‌నెస్ ఉన్నంతవరకు ఎవరైనా కొనసాగవచ్చు. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు ఆడుతూనే ఉండాలని నేను కోరుకుంటాను. వారి బ్యాటింగ్ క్రికెట్‌ను మరింత అందంగా మారుస్తుంది. ఏ ఆటగాడూ జీవితాంతం ఆడలేడు కాబట్టి నిర్ణయం తీసుకునే సరైన సమయం వచ్చినప్పుడు ఆటగాడే స్వయంగా తుది ప్రకటన చేస్తాడు" అని పేర్కొంది. Read Also: Rishabh Pant White Ball Snub: వ‌న్డేల‌ నుంచి పంత్‌ ఔట్.. ఇరానీ కప్ కి మాత్రం ప్రాముఖ్యత, సెలెక్టర్ల వ్యూహంపై ఆకాష్ చోప్రా క్లారిటీ ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. మహిళల ఆసియా కప్ విజయం తర్వాత చోటుచేసుకున్న ట్రోఫీ వివాదంపై అంజుమ్ తనదైన శైలిలో స్పందించింది. "ఏ రంగంలోనైనా గెలిచినవారికి ట్రోఫీ అందుకోవడం ఎంతో గౌరవం. అయితే ట్రోఫీ భౌతికంగా చేతికి రాకపోవడం వల్ల జట్టు కాంబినేషన్ లేదా ఆటగాళ్ల మనోస్థైర్యం ఏమాత్రం దెబ్బతినదు. మైదానంలో మ్యాచ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలవడమే ఆటగాళ్ల ప్రధాన లక్ష్యం. ట్రోఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా వారు ఆసియా కప్ ఛాంపియన్లుగానే ఉంటారు" అని పేర్కొంది. శ్రీ చరణి బౌలింగ్‌కు ఫిదా.. తెలుగు యువ స్పిన్నర్ శ్రీ చరణి ప్రదర్శనపై అంజుమ్ ప్రశంసల జ‌ల్లు కురిపించింది. డబ్ల్యూపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చరణి, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 15-16 నెలల్లోనే అద్భుతంగా రాణించిందని కొనియాడింది. ఇంగ్లాండ్ టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా

Original source: telugu.abplive.com
Read more on Kaizer News