Kaizer News

Suspension | విధుల్లో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యద

Suspension | విధుల్లో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

· State - Telangana · ntnews.com

జోగులాంబ గద్వాల : విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంకు పాల్పడిన గట్టు మండలం ఇందువాసి గ్రామపంచాయతీ కార్యదర్శి గొల్ల శేఖర్‌ ( Secretary Shekar ) ను సస్పెన్షన్‌ ( Suspension ) చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ సెక్రెటరీ శేఖర్‌పై పలు ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు పలుమార్లు గ్రామంలో విచారణ చేపట్టారని వివరించారు. పంచాయతీకి సంబంధించిన వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కార్యదర్శి విధుల్లో అలసత్వం వహించినట్లు తేలిందన్నారు. సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించగా ఆయన ఆదేశాల మేరకు శేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News