Kaizer News

ఎగ్జామ్స్ నిర్వహణలో ఏం మార్పులు చేద్దాం..ప్రజల సూచ

ఎగ్జామ్స్ నిర్వహణలో ఏం మార్పులు చేద్దాం..ప్రజల సూచనలు కోరిన హైపవర్‌‌‌‌ టాస్క్ ఫోర్స్‌‌‌‌

· State - Telangana · v6velugu.com

న్యూఢిల్లీ: పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన హైపవర్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ (హెచ్‌‌‌‌పీటీఎఫ్‌‌‌‌) ప్రజల నుంచి సూచనలు కోరింది. ఎగ్జామ్స్​ నిర్వహణ, ఏర్పాట్లు, సెక్యూరిటీ తదితర అంశాలపై స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్​ సహా అన్ని వర్గాలు తమ అభిప్రాయాలను పంపాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పేపర్‌‌‌‌ లీక్‌‌‌‌లపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలకు పరిష్కారం చూపే ఉద్దేశంతో కేంద్రం జూలైలో హెచ్‌‌‌‌పీటీఎఫ్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్‌‌‌‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌‌‌‌ నిలేకని చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా ఉన్న ఈ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌.. ప్రభుత్వ పరీక్షలు, నేషనల్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ ఏజెన్సీ (ఎన్‌‌‌‌టీఏ) నిర్వహించే పరీక్షల నిర్వహణ, భద్రత, రూపకల్పనకు సంబంధించి సమగ్ర సంస్కరణలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. విద్యా సంస్థలు, పరీక్షలు నిర్వహించే సంస్థలు, పరీక్షల కోసం పరీక్షా పత్రాలను కోరే సంస్థలు, పౌర సమాజ సంస్థలు కూడా సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది. అలాగే కంప్యూటర్‌‌‌‌ ఆధారిత పరీక్షల్లో టెక్నాలజీ వాడడం, ప్రాంతీయ, భాషాపరమైన సమస్యలపైనా సూచనలు ఇవ్వాలని కోరింది. సూచనలను ఇంగ్లిష్‌‌‌‌, హిందీ, ప్రాంతీయ భాషల్లో కూడా సమర్పించవచ్చని తెలిపింది

Original source: v6velugu.com
Read more on Kaizer News