గ్రామ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందిస్తాం సర్పంచ్ ఆత్రం శేషు నారాయణ లింగాపూర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో భాగంగా గుంనూర్ (బి) గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ ఆత్రం శేషు నారాయణ బోరుబావికి విద్యుత్ మోటారు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఆత్రం శేషు నారాయణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు