Kaizer News

Nagayalanka | కృష్ణానది తీరంలో వ్యక్తి గల్లంతు..

Nagayalanka | కృష్ణానది తీరంలో వ్యక్తి గల్లంతు..

· State - Telangana · prabhanews.com

కృష్ణానది తీరంలో వ్యక్తి గల్లంతు Nagayalanka | నాగాయలంక – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా నాగాయలంక (Nagayalanka) మండల కేంద్రంలోని కృష్ణానది తీరంలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక 6వ వార్డు పరిధిలోని చిన్న పుష్కరఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఘాట్ సమీపంలోని కరకట్ట వద్ద సదరు వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం నిలిపి ఉంచడంతో, అతడు నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అన్న కోణంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబం సొర్లగొంది గ్రామానికి చెందిన వారని, ప్రస్తుతం నాగాయలంక (Nagayalanka) లో నివాసముంటున్నారని సమాచారం. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: prabhanews.com
Read more on Kaizer News