భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెడ్డు అశోక్ నియమితులయ్యారు. ఇటీవల మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ప్రకటించగా, అందులో తెడ్డు అశోక్‌కు మండల ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ సందర్భంగా తెడ్డు అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు