Kaizer News

Suryapet: తుంగతుర్తి విద్యార్థినికి ప్రభుత్వ మెడిక

Suryapet: తుంగతుర్తి విద్యార్థినికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు!

· State - Telangana · hmtvlive.com

Shorts Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మంచ్యతండ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య కావేరి నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు.నీట్ పరీక్షలో 450 మార్కులు సాధించిన కావేరికి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు లభించింది. గిరిజన కుటుంబానికి చెందిన విద్యార్థిని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావేరిని అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు పేర్కొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News