మరిపెడ, ఆంధ్రప్రభ: మండలంలోని చిల్లంచర్ల గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి పాల్గొని ఓటర్ల వివరాల పరిశీలన, జాబితాలో తప్పుల సవరణ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని ఎంపీడీవో సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరాజ్, ఉప సర్పంచ్ అనిల్, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మణ్, వినోద్, గోపీచంద్, ఉత్తేజ్, జీపీవో మస్తాన్, బీఎల్‌ఓలు, ఓటర్లు పాల్గొన్నారు