Kaizer News

Deepika Padukone | ఆస్కార్ నుంచి దీపికా పదుకొణెకు

Deepika Padukone | ఆస్కార్ నుంచి దీపికా పదుకొణెకు అరుదైన గుర్తింపు.. ‘యే జవానీ హై దీవానీ’ సినిమాపై ప్రత్యేక పోస్ట్!

· Entertainment · ntnews.com

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్ట్ హిట్ చిత్రం ‘యే జవానీ హై దీవానీ’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె పోషించిన ‘నైనా తల్వార్’ పాత్రకు ఆస్కార్ అవార్డులను అందించే ‘ది అకాడమీ’ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. అకాడమీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని పంచుకుంటూ మీ కళ్ల ముందే ఉన్న అందాన్ని ఆస్వాదించమని నైనా మనకు ఇస్తున్న చిన్న గుర్తు అంటూ క్యాప్షన్ జోడించింది. ఉదయపూర్‌లో అదితి వివాహ వేడుకకు ముందు వచ్చే సూర్యాస్తమయ దృశ్యాన్ని అకాడమీ షేర్ చేసింది. ఈ సీన్‌లో ఎప్పుడూ లైఫ్‌లో పరిగెత్తే బన్నీతో (రణ్‌బీర్ కపూర్), క్షణాన్ని ఆస్వాదించాలని, ప్రతిదీ అనుభవించడం సాధ్యం కాదని, కొన్నిసార్లు ఉన్న చోటే సంతోషంగా గడపడం ముఖ్యమని నైనా వివరిస్తుంది. సినిమాలోని ఈ భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకుల మనసులను ఎంతగానో హత్తుకుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. “ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే,” అని ఒక అభిమాని అనగా, మరొకరు “ఎన్ని సినిమాలు చూసినా, ‘యే జవానీ హై దీవానీ’ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఏడాదికిసారైనా ఈ సినిమా చూస్తాను, ఇది ఇంటికి వెళ్లిన అనుభూతిని ఇస్తుంది,” అని పేర్కొన్నారు. 2013లో విడుదలైన ఈ చిత్రానికి రణ్‌బీర్, దీపికాలతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్లిన్ నటన, ప్రీతమ్ సంగీతం అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ సినిమాకు కోట్లాది మంది అభిమానులున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News