Kaizer News

విదేశీ ఉద్యో‘గాలం’

విదేశీ ఉద్యో‘గాలం’

· State - Telangana · sakshi.com

యూకే, రష్యా, ఇజ్రాయెల్, జపాన్, గల్ఫ్‌ దేశాల్లో భారీ జీతాలంటూ ట్రాప్‌ సోషల్‌ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా ప్రచారం ఏటా అనధికారికంగా వేలాదిమంది విదేశాలకు పయనం... ఒక్కో బాధితుడి నుంచి రూ.3–8 లక్షల దాకా ముందస్తు వసూళ్లు అమాయకులు, నిరక్షరాస్యులను నిలువునా ముంచుతున్న నకిలీ ఏజెంట్లు విదేశాలకు వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కొని, చెప్పిన జీతాలు ఇవ్వకుండా మోసగిస్తున్న ఏజెన్సీలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లబోదిబోమంటున్న బాధితులు.. అప్పులపాలవుతున్న కుటుంబాలు ఇండోనేషియాకి‘ఆఫ్‌షోర్‌’ వర్క్‌ కింద 3నెలలకోసారి వెళ్లి రావాలని చెప్పారు. ఒక్కొక్కరం అప్పుచేసి రూ. 5.40 లక్షలు కట్టాం. ఆరుగురం మొదట విజిట్‌ వీసా మీద జకార్తకు వెళ్లి నెల ఉన్నాం. మళ్లీ 45 రోజుల్లో ఎంప్లాయ్‌మెంట్‌ వీసా ఇస్తామంటే తిరిగొచ్చాం. ఆరునెలలైనా వీసా రాలేదు. అయితే ఈసారి జకార్తకు కాకుండా రూ.లక్ష జీతం వచ్చే ఫిజి వెళ్లాలని చెప్పారు. మొదట ఇద్దరం రూ.50 వేలు తీసుకెళ్లాం. మొదట 15 రోజులు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో చేశాం. మేము ఈ పనికోసం రాలేదని వేర్‌హౌసింగ్, సూపర్‌మార్కెట్, స్టోర్లు వంటి వాటిలో పని అంటే వచ్చామని చెబితే.. ఆ తర్వాత నెల రోజులు సెలవు లేకుండా రూ.34వేల జీతంతో రెస్టారెంట్లో వెయిటర్, హౌస్‌కీపింగ్‌ పనులు చేయించారు. 4 నెలల విజిట్‌వీసా ముగిశాక 29 రోజులు అదనంగా ఉండాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం టికెట్‌.. అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.7 లక్షలకుపైగా ఖర్చయింది. డబ్బులివ్వాలని అడిగితే బెదిరిస్తున్నారు. – తంగళ్లపల్లి రమేశ్, తంగళ్లపల్లి నరేశ్, కోరుట్ల జిల్లా (ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కె.రాహుల్‌) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విదేశీ ఉపాధి పేరుతో మోసాలు ఉధృతంగా సాగుతున్నాయి. అమాయకులు, నిరక్షరాస్యులకు ఎరవేసి అప్పుల పాలు చేసి గుల్లచేస్తున్నాయి. యూకే, కెనడా, రష్యా, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, గల్ఫ్‌ తదితర దేశాల్లో పెద్దమొత్తంలో జీతాలు అంటూ జరుగుతున్న మోసాలకు అంతే ఉండటం లేదు. సోషల్‌ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్‌ ద్వారా నకిలీ కన్సల్టెన్సీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నకిలీ ఆఫర్‌ లెటర్లు, విమాన టికెట్లు ఇచ్చి ఒక్కో బాధితుడి నుంచి రూ. 3–8 లక్షల దాకా ముందస్తుగా వసూళ్లు చేస్తున్నాయి. వాట్సాప్‌/టెలిగ్రామ్‌ ద్వారా నకిలీ ఆడియో/వీడియో కాల్స్‌ ద్వారా తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్‌ అయినట్లు నమ్మిస్తున్నాయి. తీరా విదేశాలకు వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కోవడం, చెప్పిన జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టులు మార్చడం, పని ఒత్తిడికి గురి చేయడం వంటి వాటికి పాల్పడుతున్నాయి. లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత మోసగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కేవలం తక్కువ చదువుకున్నవారే కాకుండా, నిరుద్యోగంతో బాధపడుతున్న ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర నిపుణులు సైతం నకిలీ కన్సల్టెన్సీల చేతిలో మోసపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు కుమ్మక్కు ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జగిత్యాల జిల్లా

Original source: sakshi.com
Read more on Kaizer News