AP News | వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేని జగన్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు