Kaizer News

Devarapalle: లక్ష్మీపురం రోడ్డు నిర్మాణానికి శంకుస

Devarapalle: లక్ష్మీపురం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

· State - Telangana · hmtvlive.com

Shorts దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ ప్రజల చిరకాల రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. లక్ష్మీపురం నుంచి దేవరపల్లి వరకు రూ.2.57 కోట్ల SASCI నిధులతో నూతన రహదారి నిర్మాణ పనులకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. గత రెండు దశాబ్దాలుగా లక్ష్మీపురం గ్రామానికి సరైన లింక్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడేవి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ సమస్యను గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.2.57 కోట్ల SASCI నిధులు మంజూరు కావడంతో నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త రహదారి నిర్మాణంతో లక్ష్మీపురం గ్రామస్తులకు దేవరపల్లితో రాకపోకలు సులభతరం కానున్నాయి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణించేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో లక్ష్మీపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News