Kaizer News

కోర్టు కేసుల్లో రాజీ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవ

కోర్టు కేసుల్లో రాజీ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి : వనపర్తి జిల్లా జడ్జి బాకరాజు శ్రీనివాసరావు

· State - Telangana · v6velugu.com

వనపర్తి, వెలుగు: కోర్టులో కేసులు ఉన్న వారు డబ్బు, సమయాన్ని వృథా చేసుకోకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బాకరాజు శ్రీనివాస్ రావు సూచించారు. కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వ 3.0 ప్రచారం కార్యక్రమంలో భాగంగా శనివారం న్యాయ సేవాధికార సంస్థ కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు ఉన్నారని, వైవాహిక, వినియోగదారుల, ఆస్తి, కుటుంబ, డబ్బు వివాదాలు తదితర వివాదాలు ఉండి కోర్టులో కేసులు పెట్టుకున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టుకు వచ్చి తమకు మధ్యవర్తిని కల్పించండి అని కోరితే వెంటనే ఒక మధ్యవర్తిని నియమించి ఇస్తారన్నారు. ఆ మధ్యవర్తి ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం కోర్టు పరిష్కరిస్తుందని తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News