Kaizer News

భారత క్రికెట్‌కు భవిష్యత్‌ ప్రణాళికలు !

భారత క్రికెట్‌కు భవిష్యత్‌ ప్రణాళికలు !

· National - India · prabhanews.com

వ బీసీసీఐ వార్షిక సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు చిన్ని క్రికెట్‌ మౌలిక వసతుల బలోపేతంపై విస్తృత చర్చ స్టేడియాల ఆధునీకరణకు ప్రాధాన్యం యువ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యాచరణ రాష్ట్ర సంఘాలతో సమన్వయానికి పెద్దపీట మహిళా క్రికెట్‌ అభివృద్ధికి ఏసీఏ కట్టుబాటు విజయవాడ,ఆంధ్రప్రభ : భారత క్రికెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంపై బీసీసీఐ 95వ వార్షిక సాధారణ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) హాజరయ్యారు. క్రికెట్‌ మౌలిక వసతులు, స్టేడియాల ఆధునీకరణ, ఆటగాళ్లకు సౌకర్యాలు, యువ ప్రతిభకు అవకాశాలు, ఆర్థిక వనరుల సమర్థ వినియోగం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి చిన్న వయస్సు నుంచే నాణ్యమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. యువ క్రీడాకారులకు మరిన్ని పోటీ వేదికలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత క్రికెట్‌ భవిష్యత్తును మరింత పటిష్ఠం చేయాలని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా క్రికెట్‌ మైదానాలు, స్టేడియాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడం, ప్రేక్షకులు, ఆటగాళ్లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రికెట్‌ అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించడంపైనా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ మౌలిక వసతుల అభివృద్ధికి ఏసీఏ ప్రాధాన్యత ఇస్తోందని కేశినేని శివనాథ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతోపాటు మహిళా క్రికెట్‌ సహా అన్ని విభాగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల మధ్య సమన్వయంతో క్రికెట్‌ను క్షేత్రస్థాయి నుంచి మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News