Kaizer News

బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి మృతికి కేటీఆర్‌ పరామ

బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి మృతికి కేటీఆర్‌ పరామర్శ

· State - Telangana · prabhanews.com

లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు చిన్నంబావి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం సింగోటం గ్రామంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన సానుభూతిని తెలియజేశారు. కేటీఆర్‌ వెంట అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News