Kaizer News

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా 'పోలీసులు మీకోస

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా 'పోలీసులు మీకోసం' కార్యక్రమం!

· State - Telangana · hmtvlive.com

Shorts Adilabad: ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామాల్లో పోలీసు-ప్రజల సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా శనివారం నార్నూర్ మండలం గుండాల గుండు గూడ గ్రామంలో నిర్వహించారు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన "పోలీసులు మీకోసం" కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. "గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు వల్లే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు" అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా లేదా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. చదువు పట్ల ఉన్న ఆవశ్యకతను తెలియజేశారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని తెలిపారు. చదువు వల్ల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు 50 పుస్తకాలు పెన్నులను అందజేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ బాబాలను, మంత్రాలను తంత్రాలను ఎలాంటి వైద్య అవసరం ఉన్న, ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News