Kaizer News

బిగ్‌ డీల్‌.. బిగ్‌ బ్లాస్ట్‌!

బిగ్‌ డీల్‌.. బిగ్‌ బ్లాస్ట్‌!

· State - Telangana · ntnews.com

బిగ్‌బ్రదర్‌ కంపెనీ.. యూఎస్‌ టూర్‌ కహానీ.. ముఖ్యనేత అమెరికా పర్యటన రద్దయ్యింది ఎందుకు? తెరవెనుక ఏం జరిగింది? కేంద్రం అనుమతించలేదెందుకు? ఏమా ‘అనుచిత’ భేటీలు? పటాన్‌చెరు టు అమెరికా!.. తీగ లాగితే కదిలిన డొంక! పైకి పేరేమో పెట్టుబడులు.. లోలోన గుట్టుగా కథలు! ముఖ్యనేత ఇటీవల అమెరికాలో పర్యటించాలని భావించగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలుసుకదా. హోదా, ఉద్దేశానికి తగినట్టు ఆ కార్యక్రమాలు లేవని కేంద్రం స్పష్టంచేసిందనీ తెలుసు కదా. ‘అనుచిత’ (ఇన్‌ అప్రాప్రియేట్‌) అనే పదమూ వాడింది కదా. దీంతో లండన్‌ నుంచి మధ్యలోనే తిరిగి వచ్చిన ముఖ్యనేత.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించాలనుకొంటే, కేంద్రం అడ్డుపుల్ల వేసిందని చిందులేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అంత జరిగినా కేంద్రం.. ఆ ఆరోపణలను ఖండించలేదు. ఆ పర్యటనకు సంబంధించి తాము గుర్తించిన అనుచితమేమిటో వెల్లడించలేదు. మళ్లీ ఆ విషయంపై మాట్లాడలేదు. దీన్నిబట్టే ఆ పర్యటన ఉద్దేశాలు ఎంతటి సున్నితమైనవో, ఎంత సీరియస్‌ అంశాలో అర్థంచేసుకోవచ్చు. గతేడాది ఆగస్టులో ముఖ్యనేత, ఆయన బృందం అమెరికాలో పర్యటించారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా తదితర రాష్ర్టాలు తిరిగారు. పెట్టుబడుల కోసమంటూ 50కి పైగా బిజినెస్‌ మీటింగ్స్‌ నిర్వహించారు. మరి, అప్పటి అమెరికా పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడే ఎందుకు నిరాకరించినట్టు?? మీకు వచ్చినట్టే ‘నమస్తే తెలంగాణ’కూ ఇదే సందేహం వచ్చింది. దీంతో వారంరోజులపాటు లోతైన పరిశోధన జరిపింది. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యనేత అమెరికా పర్యటన రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కాదని, బిగ్‌బ్రదర్స్‌ బోగస్‌ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చుకోవడానికేనని చివరికి తేలింది. ముఖ్యనేత.. బిగ్‌బ్రదర్‌.. బిగ్‌బ్రదర్‌ కొడుకు.. ఓ న్యూయార్క్‌ ప్రముఖుడు ఓ అమెరికన్‌ పారిశ్రామికవేత్త ఎవరు వీళ్లంతా.. టెస్సెరాక్ట్‌.. రెడ్లర్‌.. ఓ ఇంటర్నేషనల్‌ డిఫెన్స్‌ కంపెనీ.. మరో స్ట్రాటజిక్‌ ఫోరమ్‌ ఏందీ కత…. పటాన్‌చెరు.. జీడిమెట్ల.. రావిర్యాల.. దావోస్‌.. ఇజ్రాయెల్‌.. అమెరికా.. ఏమిటీ లింకు? అర్థమవట్లేదా? అయోమయంగా ఉన్నదా? సంబంధం లేకుండా రాశామనుకుంటున్నారా? కాస్త ఆగండి. కథనం చదవండి.. ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడుతుంది..! టెస్సెరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఓ కంపెనీ ఉంది. 2023 ఏప్రిల్‌ 11న పటాన్‌చెరులో లక్ష రూపాయల పెయిడ్‌అప్‌ క్యాపిటల్‌తో ప్రారంభమైంది. ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ రంగానికి అవసరమైన విడి భాగాలను తయారు చేస్తామంటూ కంపెనీ తన వెబ్‌సైట్‌లో చెప్పుకొన్నది. అయితే, ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా ఏవియేషన్‌ పరికరాల తయారీ అంటూ ఆర్భాటాలకు పోతున్న ఈ కంపెనీ.. పటాన్‌చెరులో ఓ ఇంట్లో, జీడిమెట్లలో మరో చిన్న గోదాంలో కార్యకలాపాలు సాగిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా రికార్డుల ప్రకారం ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీ ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుంది? అంటూ అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టెస్సెరాక్ట్‌ కంపెన

Original source: ntnews.com
Read more on Kaizer News