Kaizer News

జల్సాల ఖర్చుల కోసం బ్యాటరీల చోరీ

జల్సాల ఖర్చుల కోసం బ్యాటరీల చోరీ

· Health · prabhanews.com

గంటల్లో ఇద్దరు నిందితుల గుర్తింపు.. ఒకరి అరెస్టు, మరొకరు పరారు జన్నారం, ఆంధ్రప్రభ: జల్సాల ఖర్చుల కోసం ఇంటి ముందు నిలిపి ఉంచిన రెండు ఆటోల బ్యాటరీలను ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి చోరీ చేసిన ఘటన జన్నారం మండలం పొనకల్‌లో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. పొనకల్‌ గ్రామంలోని వినాయకనగర్‌ తహసీల్దార్‌ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఎల్కపల్లి నరేశ్‌కు చెందిన ఏపీ 1ఎక్స్ 7765 ఆటో, సంబరాజుల రాజశేఖర్‌కు చెందిన టీఎస్ 19టీ 4353 ఆటో బ్యాటరీలను ఈ నెల 16న రాత్రి దొంగలు అపహరించారు. వాటి విలువ సుమారు రూ.10 వేలుగా పోలీసులు తెలిపారు. నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గుర్రం ఉదయ్‌కిరణ్‌ దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే ధర్మారానికి చెందిన గడ్డి చంద్రశేఖర్‌, పొనకల్‌ వినాయకనగర్‌కు చెందిన ఎరుకల అరుణ్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.చోరీ చేసిన రెండు బ్యాటరీలను విక్రయిస్తుండగా చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి లక్షెట్టిపేట కోర్టుకు తరలించారు. మరో నిందితుడు అరుణ్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్సై, పోలీసులను పలువురు అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News