Kaizer News

Chowdepalle: చౌడేపల్లిలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు

Chowdepalle: చౌడేపల్లిలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు!

· State - Telangana · hmtvlive.com

Shorts Chowdepalle: చౌడేపల్లి మండల కేంద్రానికి చెందిన కస్తూరి రమణ కుమారుడు మహేష్ 30 చౌడేపల్లి ఇండియన్ బ్యాంక్ పనిచేస్తున్నాడు బ్యాంకు మేనేజర్ నరేంద్ర తో కలిసి బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తూ చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారి చిట్టిరెడ్డిపల్లి గ్రామం వద్ద చౌడేపల్లి గ్రామం గోసుల కురపల్లికి చెందిన సంతోష్ 22 చంద్రశేఖర్ లు ఇద్దరు తోడేపల్లి నుండి పలమనేరు వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న బ్యాంకు వారి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొన్నారు ఈ ప్రమాదంలో బ్యాంకు మేనేజర్ తో పాటు వెళుతున్న మహేష్ మరో వాహనంలో ఉన్న కురపల్లికి చెందిన సంతోష్లు అక్కడికక్కడే మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్ మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో రోదనలు మిన్నంటాయి మృతి చెందిన వారిద్దరూ చౌడేపల్లికి చెందిన వారు కావడంతో చౌడేపల్లిలో విషాదశాలు అలముకున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో ఒక ద్విచక్ర వాహనంలో మద్యం బాటిల్లు కూడా ఉండడం గమనార్హం రోడ్డు ప్రమాదానికి కారణం మద్యం మత్తే కారణమని స్థానికులు అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ బ్యాంక్ ఉద్యోగికి మూడు నెలల క్రితం వివాహమైంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News