Nandyal: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు మెరుగైన మానవతా సేవలు అందించే దిశగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా తెలిపారు. శనివారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెడీ క్రాస్ సొసైటీ వారి వార్షిక సర్వ సభ్య సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా, జిల్లా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన జిల్లా గా ఏర్పడిన సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీకి సొంత భవనం, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వంటి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం అనేక సేవలను అందించే స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పాత జపాన్ ప్రాజెక్టు భవనాన్ని రెడ్‌క్రాస్ సొసైటీకి కేటాయించి, అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సొంత భవనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా ఫ్రీజర్లు, ఏసీలు, ల్యాబ్ టెక్నీషియన్ తదితర సదుపాయాలతో బ్లడ్ స్టోరేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానంపై యువత, మహిళల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్‌క్రాస్ భవనానికి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు NEDCAP మార్గదర్శకత్వంలో పూర్తి స్థాయి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు* . ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేలా GGH ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. డోన్, శ్రీశైలం ప్రాంతాలతో పాటు NH-40, NH-340C జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కొత్తగా బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవయవదాన ప్రాముఖ్యతపై విస్తృత అవగాహనకల్పించాలన్నారుఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో కుటుంబాలకు అవయవదానం ద్వారా లభించిన ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ బీమా పథకం ద్వారా సుమారు రూ.1 కోటి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని నిరాశ్రయులు, యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు MEPMA, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నైట్ షెల్టర్లను రెడ్‌క్రాస్ పర్యవేక్షణలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు సభ్యత్వాలను పెంచాలని, జిల్లాలోని పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు రెడ్‌క్రాస్‌తో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడే రక్తదానం, అవయవదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, వైద్య శిబిరాలు, ఆరోగ్య సేవలు వంటి కార్యక్రమాల్లో రెడ్‌క్రాస్ మరింత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు . జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవతా సేవా కార్యక